అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి | - | Sakshi
Sakshi News home page

అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి

Nov 11 2026 12:49 AM | Updated on Nov 11 2026 12:49 AM

అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి

కామారెడ్డి టౌన్‌: ముసాయిదా ఓటర్ల జాబితాలో పేర్లు లేని అర్హులైన వ్యక్తులు తుది ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించిందని అదనపు రెవెన్యూ కలెక్టర్‌ విక్టర్‌ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో ఎన్యుమరేషన్‌ ఫారాలు జారీ చేసినప్పటికీ అందుబాటులో లేకపోవడం లేదా నివాసం మారడం వంటి కారణాల వల్ల కొందరి పేర్లు ముసాయిదా జాబితాలో నమోదు కాలేదన్నారు. అలాంటి వారు వెంటనే సంబంధిత బూత్‌ స్థాయి అధికారులు (బీఎల్‌వోలు), ఏఈఆర్‌వోలు, ఈఆర్‌వోలను సంప్రదించి నిర్దేశిత విధానంలో ఎన్యుమరేషన్‌ ఫారాలు అందజేయాలని సూచించారు. ఈనెల 21వ తేదీలోపు దరఖాస్తులు సమర్పించి పేర్ల నమోదును ధ్రువీకరించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఎన్‌వై గిరి, ఎన్నికల సూపరింటెండెంట్‌ రాజేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement