ఎల్లారెడ్డిరూరల్:మండలంలోని మల్లయ్యపల్లి గ్రా మ శివారులో వరి కొయ్యలకు నిప్పు పెట్టడంతో ద ట్టమైన పొగలు వ్యాపించాయి. పంట కోతల అనంతరం పొలాల్లో మిగిలిన వరి కొయ్యలను తొలగించేందుకు కొందరు రైతులు వాటికి నిప్పంటించడంతో పరిసర ప్రాంతమంతా పొగమయంగా మారింది.దీంతో అటుగా వెళ్లే వాహనదారులు, స్థానిక ప్ర జలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి పంట అవశేషాలను కాల్చకుండా రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి తగు చర్యలు చేపట్టాలని వాహనదారులు, స్థానికులు కోరుతున్నారు.


