● 28వ రోజుకు చేరిన ఎన్‌హెచ్‌ఎం
ఉద్యోగుల సమ్మె
కామారెడ్డి టౌన్:తమ న్యాయమైన సమస్యలను ప రిష్కరించాలని కోరుతూ జిల్లా కేంద్రంలోని కలెక్టరే ట్ ధర్నా చౌక్‌లో జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్‌హెచ్‌ఎం) ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె సోమవా రం నాటికి 28వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఉద్యోగులు వినూత్న రీతిలో ప్రభుత్వానికి సాష్టాంగ నమస్కారాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. ఉద్యోగులు సంఘం జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సర్వీసును తక్షణమే రెగ్యులరైజ్ చేయాలని, కనీస వేతన స్కేల్ వర్తించేలా క్యాడర్ ఫిక్సేషన్ చేపట్టాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం, ప్రభుత్వానికి సద్బుద్ధి ప్రసాదించి తమ హక్కులను పరిష్కరించేలా చూడాలని ఉద్యోగులంతా తమ కోరికలను తెల్ల కాగితాలపై రాసి తిరుమల వేంకటేశ్వర స్వామికి పంపించారు. కార్యక్రమంలో జిల్లా ఎన్‌హెచ్‌ఎం జేఏసీ అధ్యక్షుడు సుమన్, వైద్యులు, నాయకులు పద్మజ, హరీశ్, వేణుమాధవ్, రాహుల్, సందీప్, అఖిల్, శివ, పండరి, బాలు, స్వర్ణలత, శోభ, భారతి, శారద, లక్ష్మి, సువర్ణ, ప్రతిభ తదితరులు పాల్గొన్నారు.


