రాజంపేట/ కామారెడ్డి రూరల్: రాజంపేట మండల కేంద్రంలో పలువురు లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణాలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు శనివారం భూమి పూజ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సాయిబాబా పటేల్, నేతలు దొబ్బల దుర్గం, అంద్యాల సురేశ్, మేకల నర్సింలు, పందల స్వామి, పుట్ట గణేశ్, తొడంగుల సిద్ధరాంలు, ఆకుల రాజిరెడ్డి, అల్తాప్ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి మండలంలోని క్యాసంపల్లిలో లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణాలకు కాంగ్రెస్ నాయకులు ముగ్గు మార్కింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్పంచ్ అడపా శ్యామ్, ఉప సర్పంచ్, జీపీ కార్యదర్శి చంద్రకళ, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.


