ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం మండల కమిటీలు ఎన్నిక
బాన్సువాడ: ఉద్యోగులు చేసిన తప్పు ప్రజలకు శాపంగా మారింది. పట్టణంలోని కొన్ని కాలనీల్లో మున్సిపల్, రిజిస్ట్రార్ కార్యాలయం సిబ్బంది ఒకే ఇంటికి రెండు నంబర్లు ఇవ్వడంతో యజమానులు తంటాలు పడుతున్నారు. ఇల్లు క్రయ, విక్రయాల సమయంలో రిజిస్ట్రేషన్ కార్యాలయం నుంచి ఒక ఇంటి నంబర్ అలాట్ చేశారు. ఇది తెలియని చాలా మంది మున్సిపల్ కార్యాలయం నుంచి మరో ఇంటి నంబర్ తీసుకున్నారు. ఇలా ఒకే ఇంటికి రెండు నంబర్లు ఆన్‌లైన్‌లో నమోదయ్యాయి. ఈ విషయం యజమానులకు తెలియదు. తాజాగా ఆస్తి పన్ను బకాయి నోటీసులు రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
150 ఇళ్లకు రెండు నంబర్లు..
పట్టణంలోని టీచర్స్ కాలనీ, ఎన్‌జీవోఎస్ కాలనీ, సాయినగర్ కాలనీ, సాయికృపా కాలనీ, అర్ఫత్ కాలనీ, బీడీ వర్కర్స్ కాలనీ, చైతన్య కాలనీ తదితర ప్రాంతాల్లో రెండు నంబర్లు ఉన్న భవనాలు పదుల సంఖ్యలో ఉన్నట్లు తెలిసింది. ఒక్క బాన్సువాడ బల్దియా పరిధిలో సుమారు 130 –150 వరకు ఒకే ఇంటికి రెండు నంబర్లు ఉన్నట్లు తెలిసింది.
బాన్సువాడ మున్సిపల్ పరిధిలో ఒక ఇంటికి రెండు నంబర్లు ఉన్న ఇళ్ల జాబితాను తయారు చేస్తున్నాం. ఏ కాలనీల్లో ఉన్న వరుస నంబర్లను వారికి ఇచ్చి రెండవ నంబర్‌ను డిలెట్ చేస్తాం. పట్టణంలో ఉన్న ప్రతీ ఇంటిని క్షుణంగా పరిశీలించి జాబితాను రూపొందిస్తున్నాం.
–గంగాధర్, మున్సిపల్ కమిషనర్, బాన్సువాడ
బాన్సువాడ బల్దియా పరిధిలో
గృహాలు – 8,200
పట్టణ జనాభా– 40 వేలు
వార్డులు–19
బాన్సువాడ బల్దియాలో పలు ఇళ్లకు రెండు నంబర్లు
రెండింటికీ ఆస్తి పన్ను జారీ
పన్ను చెల్లింపుపై యజమానుల
తర్జన భర్జన


