ఆరుతడి పంటలు సాగుచేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ఆరుతడి పంటలు సాగుచేసుకోవాలి

Nov 8 2026 1:13 AM | Updated on Nov 8 2026 1:13 AM

లింగంపేట/ నిజాంసాగర్‌/ బాన్సువాడ రూరల్‌: ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు నెలకొన్న దృశ్యా రైతులు ఆరుతడి పంటలు సాగుచేసుకోవాలని లింగంపేట మండల వ్యవసాయాధికారి అనిల్‌కుమార్‌ అన్నారు. శనివారం ఆయన లింగంపేట మండలం శెట్పల్లిసంగారెడ్డి గ్రామంలో ఏర్పాటు చేసిన ఖేత్‌ బచావో అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా యాసంగి పంటలపై రైతులకు అవగాహన కల్పించారు. రైతులు భూసార పరిరక్షణకు తప్పనిసరిగా మట్టి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఽవరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్‌, ఎంపీవో మలహరి, ఏఈ ఇరిగేషన్‌ సతీశ్‌, సర్పంచ్‌ కత్తుల లక్ష్మి, అంజయ్య, ఉపసర్పంచ్‌ నీల రాజు, వ్యవసాయ విస్తీర్ణాధికారి సంతోష్‌కుమార్‌, జీపీ కార్యదర్శి రాజు, రాజయ్య, మహిపాల్‌, బాలరాజు, కిష్టయ్య, రైతులు పాల్గొన్నారు. మహమ్మద్‌నగర్‌ మండలం తుంకిపల్లి గ్రామంలో యాసంగి పంటల సాగుపై క్లస్టర్‌ ఏఈవో మధుసూదన్‌ రైతులకు అవగాహన కల్పించారు. రైతులు ఆరుతడి పంటలు వేసుకోవాలన్నారు. సర్పంచ్‌ కుమ్మరి రాములు, జీపీ కార్యదర్శి మౌనిక, రైతులు అంజయ్య, బాలకృష్ణ, సాయిలు తదితరులు ఉన్నారు. బాన్సువాడ మండలంలోని హన్మాజీపేట్‌లో ఉపసర్పంచ్‌ బబ్యానాయక్‌ అధ్యక్షతన వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఖేత్‌ బచావో అభియాన్‌ కార్యక్రమం నిర్వహించారు. కోనాపూర్‌ క్లస్టర్‌ ఏఈవో జ్ఞానేశ్వర్‌ రైతులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. నాయకులు వెంకాగౌడ్‌, రంగరిగారి సంజీవులు, ప్రవీణ్‌ గౌడ్‌, లింగం, వడ్ల బాగయ్య, తుకారాం, కృష్ణ, కొంకి పోచయ్య, బాలరాజు, పాశం బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement