ఇరిగేషన్‌ మంత్రిని కలిసిన టీజేఎస్‌ నాయకులు | - | Sakshi
Sakshi News home page

ఇరిగేషన్‌ మంత్రిని కలిసిన టీజేఎస్‌ నాయకులు

Nov 8 2026 1:13 AM | Updated on Nov 8 2026 1:13 AM

నాగిరెడ్డిపేట/ లింగంపేట: ఎల్లారెడ్డి నియోజకవర్గంలో గతయేడు సంభవించిన భారీవరదలతో తెలగిపోయిన చెరువులకు ఆనకట్టలు నిర్మించేందుకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని రాష్ట్రనీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని టీజేఎస్‌ నాయకులు కోరారు. హైదరాబాద్‌లో శనివారం ఎమ్మెల్సీ కోదండరాం ఆధ్వర్యంలో తెలంగాణ జనసమితి(టీజేఎస్‌) ప్రధాన కార్యదర్శి డా.నిజ్జన రమేశ్‌ మంత్రిని కలిసి నియోజకవర్గంలోని సమస్యలను వివరించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో వర్షాలు లేక భూగర్భజలాలు తగ్గిపోయి రైతులకు సాగునీటి సమస్య తలెత్తిందని మంత్రితో ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గంలోని కన్నాపూర్‌, పొల్కంపేట, లింగంపల్లి చెరువుల గురించి ఆయన మంత్రితో చర్చించారు. మంత్రిని కలిసినవారిలో ఆశప్ప, సలీంపాష, అరుణ్‌కుమార్‌ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement