కొడుకును హతమార్చిన తండ్రి రిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

కొడుకును హతమార్చిన తండ్రి రిమాండ్‌

Nov 8 2026 1:13 AM | Updated on Nov 8 2026 1:13 AM

నిజాంసాగర్‌(జుక్కల్‌): మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలని గొడవపడిన కుమారుడిని హతమార్చిన తండ్రి శివరాంను శనివారం బిచ్కుంద పోలీసులు రిమాండ్‌కు తరలించారు. సీఐ రవికుమార్‌ మాట్లాడుతూ బిచ్కుందకు చెందిన చాకలి సురేష్‌ జులాయిగా తిరుగుతూ మద్యానికి బానిసయ్యాడు. మద్యం తాగేందుకు డబ్బుల కోసం నిత్యం తల్లిదండ్రులతో గొడపడుతున్నాడు. ఈ నెల 4న సురేష్‌ డబ్బులు ఇవ్వాలని తల్లి, తండ్రితో గొడవపడి తల్లిపై చేయిచేసుకునే ప్రయత్నం చేశాడు. తల్లిపైకి వెళ్లిన కుమారుడు సురేష్‌ను తండ్రి శివరాం నెట్టేసి టవల్‌తో గొంతునులిమి హతమార్చినట్లు సీఐ వెల్లడించారు. శివరాంపై హత్యనేరం కేసు నమోదు చేసి, టవల్‌ను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. హత్య కేసును ఛేదించిన ఎస్సై రాజు, సీఐ రవీకుమార్‌ ఎస్పీ రాజేశ్‌చంద్ర అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement