దోమకొండ: తాగునీటిని పొదుపుగా వాడుకోవాలని ఎంపీవో రవికుమార్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో జలఅర్పణ్ దివస్ కార్యక్రమం నిర్వహించగా ఆయన పాల్గొని మాట్లాడారు. మిషన్ భగీరథ పథకం వల్ల ప్రతి ఇంటికి తాగునీరు అందుతోందని అన్నారు. ఎల్‌నినో ప్రభావం వల్ల తాగు సాగునీటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని ప్రజలు నీటిని జాగ్రత్తగా పొదుపుగా వాడుకోవాలని అవగాహన కల్పించారు. జీపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో తాగునీటి పొదుపుపై ప్రతిజ్ఞ నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ ఐరేని నర్సయ్య, ఉపసర్పంచ్ బొమ్మెర శ్రీనివాస్, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ రజిత, సింగిల్ విండో చైర్మన్ అనంతరెడ్డి, చేనేత సహకార సంఘం అధ్యక్షుడు బత్తిని సిద్ధరాములు, జీపీ కార్యదర్శి యాదగిరి, వార్డు సభ్యులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.


