లింగంపేట: మండలంలోని ఆయా గ్రామాల్లో ఉన్న పాఠశాలల్లో శనివారం దీపావళి సంబరాలు నిర్వహించారు. పాఠశాలల్లో చిన్నారులు, ఉపాధ్యాయులు పటాకులు కాల్యారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డిరూరల్: పటాకుల దుకాణాల నిర్వాహకులు అగ్నిప్రమాద నివారణ చర్యలు తీసుకోవాలని ఫైర్ ఆఫీసర్ వినోద్ అన్నారు. శనివారం పటాకుల దుకాణాలను పరిశీలించారు. దుకాణాల నిర్వాహకులు నిబంధనలు అతిక్రమించరాదని అన్నారు. ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు.
కామారెడ్డి అర్బన్: ధన, శని, యమ త్రయోదశి, మాస శివరాత్రి, ధన్వంతరి జయంతి సందర్భంగా శనివారం తెల్లవారు జామున స్థానిక శ్రీశనేశ్వరుడు, యమ ఆలయం వద్ద వేదపండితులు ఆంజనేయశర్మ విశేష తైలాభిషేకం నిర్వహించారు. శనేశ్వర హోమం, సాయంత్రం వైద్యనాథేశ్వర సామూహిక రుద్రాభిషేకం చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని శని, యమ తైలాభిషేక పూజలు, ప్రదిక్షణలు చేపట్టారు.
నస్రుల్లాబాద్: మండలంలోని మిర్జాపూర్ గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి, శనివారం హాజీపూర్‌లో పేకాడుతున్న 10 మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఏఎస్సై గంగారాం తెలిపారు. వారి నుంచి రూ.9,460 నగదు, 8 సెల్‌ఫోన్లు, రెండు బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.


