అనుమానాస్పదస్థితిలో యువతి మృతి | - | Sakshi
Sakshi News home page

అనుమానాస్పదస్థితిలో యువతి మృతి

Nov 8 2026 1:13 AM | Updated on Nov 8 2026 1:13 AM

గాంధారి(ఎల్లారెడ్డి): అనుమానాస్పద స్థితిలో యువతి మృతి చెందిన ఘటన గాంధారి మండల కేంద్రంలో శనివారం చోటు చేసుకుంది. సదాశివనగర్‌ సీఐ వీరయ్య తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ ప్రాంతానికి చెందిన ఆర్తి కౌర్‌(20) ఈ నెల 4న గాంధారిలో ఉండే అమ్మమ్మ ఇంటికి తల్లిదండ్రులతో కలిసి వచ్చింది. శుక్రవారం అర్ధరాత్రి అందరూ నిద్రించిన తర్వాత ఇంటి బయటకువెళ్లింది. గమనించిన కుటుంబసభ్యులు చుట్టు పక్కల వెతికారు. ఆచూకీ లభించలేదు. శనివారం ఉదయం సెల్‌టవర్‌ వద్ద ఆర్తి కౌర్‌గా మృతదేహమై కనిపించింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మొదట హత్యగా భావించారు. సీసీఫుటేజీలను పరిశీలించి డాగ్‌స్క్వాడ్‌ రప్పించి విచారణ చేశారు. పోలీసు జాగిలం ఘటనా స్థలం నుంచి వారి ఇంటి వరకు వెళ్లి తిరిగి వచ్చింది. యువతి మొహంపై బలమైన గాయం, ఓ చేయి, కాలు విరిగి ఉండటంతో సెల్‌టవర్‌ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా భావిస్తున్నామని సీఐ తెలిపారు. యువతికి ఇటీవల సూర్యపేట్‌ జిల్లా మిర్యాలగూడకు చెందిన యువకునితో పెళ్లి నిశ్చయమైంది. ఈ నెల 28న పెళ్లి జరగాల్సి ఉందని పేర్కొన్నారు. ఘటనా స్థలాన్ని ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్‌ రావు పరిశీలించారు. మృతురాలి తండ్రి బహదూర్‌ సింగ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. స్థానిక ఎస్సై మహేందర్‌, సిబ్బంది ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement