అట్టహాసంగా ప్రారంభమైన జిల్లా స్థాయి క్రీడలు | - | Sakshi
Sakshi News home page

అట్టహాసంగా ప్రారంభమైన జిల్లా స్థాయి క్రీడలు

Nov 8 2026 1:13 AM | Updated on Nov 8 2026 1:13 AM

అట్టహాసంగా ప్రారంభమైన జిల్లా స్థాయి క్రీడలు నూతన కార్యవర్గం ఎన్నిక 26వ రోజుకు చేరిన సమ్మె

పెద్దకొడప్‌గల్‌: మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో శనివారం 70వ ఎస్జీఎఫ్‌ జిల్లా స్థాయి అండర్‌–14, 17 కబడ్డీ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు క్రీడలను ప్రారంభించారు. క్రీడాకారుల కోసం హెల్త్‌ క్యాంప్‌ ఏర్పాటు చేశారు. విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గంగారాం, తహసీల్దార్‌ రాజశేఖర్‌, ఎంపీడీవో అభినవ్‌ చందర్‌, ఎంఈవో ప్రవీణ్‌ కుమార్‌, ఎస్సీ సెల్‌ మాజీ చెర్మన్‌ సౌదగార్‌ అరవింద్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

సదాశివనగర్‌: హ్యాండ్‌బాల్‌ అసోసియేషన్‌ జిల్లా నూతన కార్యవర్గాన్ని శనివారం మండలంలోని భూంపల్లి జీపీ గార్డెన్‌లో ఏకగీవ్రంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా విజయ్‌బాబు, ప్రధాన కార్యదర్శిగా ఏనుగు సతీశ్‌రెడ్డి, కోశాధికారిగా బ్యాగరి లింగం ఎన్నికయ్యారు. జిల్లా యువజన క్రీడల అధికారి వెంకటేశ్వరగౌడ్‌, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

కామారెడ్డి టౌన్‌: తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ జిల్లా కేంద్రంలోని ఽకలెక్టరేట్‌ ధర్నా చౌక్‌లో జాతీయ ఆరోగ్య మిషన్‌ ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె శనివారంతో 26వ రోజుకు చేరింది. ఉద్యోగుల సంఘం జిల్లా జేఏసీ అధ్యక్షుడు తాళ్లపల్లి సుమన్‌, మారుతి, హరీశ్‌, అశ్విని, రాహుల్‌, గౌతమి, మంజుల, ఇంది ర, శ్రావణి, వరలక్ష్మి, స్వాతి, రమ్య, భారతి, నిశాంతిని, రఘు, శోభారాణి, గణేశ్‌, శేఖర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement