చికిత్స పొందుతూ ఒకరు మృతి | - | Sakshi
Sakshi News home page

చికిత్స పొందుతూ ఒకరు మృతి

Nov 8 2026 1:13 AM | Updated on Nov 8 2026 1:13 AM

రోడ్డు ప్రమాదంలో యువకుడు..

బాన్సువాడ : నాటు బాంబు పేలుళ్ల ఘటనలో గాయపడిన కాదమాన్ల రమేశ్‌(30) అనే వ్యక్తి చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. ఐదు రోజుల క్రితం బాన్సువాడ మండలంలోని ఎర్రమన్నుకుచ్చ కాలనీలో నాటు బాంబులు పేలడంతో ఏడుగురు గాయపడిన విషయం తెలిసిందే. చికిత్స పొందుతూ రమేశ్‌ మృతి చెందినట్లు సీఐ శ్రీధర్‌ తెలిపారు.

బడాపహాడ్‌లో ఒకరు..

వర్ని: మండలంలోని బడా పహాడ్‌ వద్ద గుర్తు తెలియని వ్యక్తి(40) శనివారం మధ్యాహ్నం మృతి చెందినట్లు ఎస్సై వంశీకృష్ణారెడ్డి తెలిపారు. మృతుడు ఐదు అడుగుల ఎత్తు, ఆకుపచ్చ రంగు టీ షర్టు ధరించి ఉన్నాడని పేర్కొన్నారు. శరీరంలో నీటిశాతం తగ్గడం కారణంగానే వ్యక్తి మృతి చెందినట్లు అనుమానం వ్యక్తం చేశారు. సంబంధీకులు ఎవరైనా ఉంటే వర్ని పోలీస్‌ స్టేషన్‌లో సంప్రదించాలని సూచించారు.

కామారెడ్డి టౌన్‌: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందిన ఘటన దేవునిపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని చిన్నమల్లారెడ్డి గ్రామానికి చెందిన గుర్జా నవదీప్‌ (20) శనివారం లింగాయిపల్లి టర్నింగ్‌ సమీపంలో బైక్‌ పైనుంచి ప్రమాదవశాత్తు కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలోనే నవదీప్‌ మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రంజిత్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement