● డీఈవో మల్లికార్జున్
కామారెడ్డి టౌన్ : విద్యార్థులు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుకుని, ఆత్మవిశ్వాసాన్ని మెరుగు పరుచుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి మల్లికార్జున్ సూచించారు. దేవునిపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి రోల్ ప్లే పోటీల ముగింపు కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పోటీ పరీక్షలలో రాణించాలంటే చదువుతో పాటు కళలు, సాహిత్యం, సాంస్కృతిక కార్యక్రమాలలో తరచూ పాల్గొంటూ సృజనాత్మక నైపుణ్యాలు పెంపొందించుకోవాలన్నారు. ఈ పోటీలలో కామారెడ్డి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రథమ, దేవునిపల్లి విద్యార్థులు ద్వితీయ, జనగామ ఉన్నత పాఠశాల విద్యార్థులు తృతీయ బహుమతులు గెలుచుకున్నారు. కార్యక్రమంలో జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి వేణుగోపాల్, ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ ఎఫ్‌ఎల్‌ఎం సెల్ సభ్యులు రంజిత్‌రెడ్డి, శ్రీధర్‌గౌడ్, లాల్ సింగ్ స్వామి, న్యాయ నిర్ణేతలు శ్రీనివాస్ యాదవ్, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


