ఓటర్లకు మరో అవకాశం | - | Sakshi
Sakshi News home page

ఓటర్లకు మరో అవకాశం

Nov 8 2026 1:07 AM | Updated on Nov 8 2026 1:07 AM

కామారెడ్డి టౌన్‌ : ఏఎస్‌డీడీ (ఆబ్సెంట్‌, షిఫ్టెడ్‌, డెడ్‌, డూప్లికేట్‌) జాబితాలో నమోదైన ఓటర్లు తుది జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం మరో అవకా శం కల్పించిందని అదనపు కలెక్టర్‌ విక్టర్‌ తెలి పారు. శనివారం ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలన్నారు. గతంలో ఎన్యుమరేషన్‌ ఫారాలు జారీ చేసినప్పటికీ పలు కారణాలతో ముసాయిదా జాబితాలో చోటు దక్కని వారి కోసం ఈ ప్రక్రియను చేపట్టినట్లు తెలిపారు. క్షేత్రస్థాయి పరిశీలన సమయంలో అందుబాటులో లేనివారు, నివాసం మారినవారు, మరణించినట్లు తప్పుగా నమోదైనవారు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల పేర్లు నమోదైనవారి పేర్లు ముసాయిదా ఓటర్ల జాబితాలో లేవని, సంబంధిత పౌరులు వెంటనే తమ వివరాలను ముసాయిదా జాబితాలో సరిచూసుకోవాలని సూచించారు. ఓటు హక్కు పొందాలనుకునే వారు వెంటనే సంబంధిత బూత్‌ స్థాయి అధికారులు (బీఎల్‌వో), ఏఈఆర్‌వో లేదా ఈఆర్‌ వోలను సంప్రదించి అవసరమైన ఎన్యుమరేన్‌ డాక్యుమెంట్లు సమర్పించాలని పేర్కొన్నారు. అర్హులైనవారు ఈనెల 21 వ తేదీలోగా సంబంధిత పత్రాలను సమర్పించాలని సూచించారు.

ఏఎస్‌డీడీ జాబితాలోని ఓటర్లకు ఎన్నికల సంఘం వెసులుబాటు

నవంబర్‌ 21లోగా పత్రాలు సమర్పించాలి

అదనపు కలెక్టర్‌ విక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement