బిగుస్తున్న ఉచ్చు! | - | Sakshi
Sakshi News home page

బిగుస్తున్న ఉచ్చు!

Nov 7 2026 12:30 AM | Updated on Nov 7 2026 12:30 AM

మున్సిపల్‌ వర్గాల్లో కలకలం

కామారెడ్డి టౌన్‌ : కామారెడ్డి మున్సిపాలిటీలో అవినీతి, అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిపై ఉచ్చు బిగుస్తోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్నవారికి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఎన్‌వై గిరి షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు.

బల్దియాలో అవకతవకలు, అవినీతి, అక్రమాలపై ఇటీవల ‘సాక్షి’ దినపత్రికలో కథనాలు ప్రచురితమైన విషయం తెలిసిందే. టేక్రియాల్‌ చెరువులో ఇనుప స్క్రాప్‌ విక్రయం, పలు భవన నిర్మాణల యజమానుల నుంచి అక్రమ వసూళ్లు, సర్టిఫికెట్‌ల జారీలో చేతివాటం, సానిటేషన్‌ విభాగంలో కార్మికుల వేతనాలు, వాహనాల ఇంధన బిల్లులలో చేతివాటం, అస్తి పన్ను ముదింపులో అవకతవకలను ‘సాక్షి’ కథనాలు ఎత్తిచూపాయి. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో అదనపు కలెక్టర్‌ రెండు రోజులపాటు బల్దియాలో విచారణ జరిపారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న పలు విభాగాల ఉన్నతాధికారులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. మున్సిపల్‌ కమిషనర్‌, ఇద్దరు టీపీవోలు, ఆర్‌వో, డీఈ, ఏఈతో పాటు శానిటేషన్‌ ఇన్‌చార్జీలకు నోటీసులు అందాయి. అవినీతి, అక్రమాలపై ఇటీవల పత్రికల్లో వచ్చిన కథనాలపై సమగ్ర వివరణ ఇవ్వాలని అదనపు కలెక్టర్‌ ఆదేశించారు. దీంతోపాటు మూడు నెలలుగా బల్దియాలోని అన్ని విభాగాల్లో చేపట్టిన పనులు, జరిగిన లావాదేవీలపై పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని ఆదేశించారు.

బల్దియా అధికారులకు షోకాజ్‌ నోటీసుల అంశం మున్సిపల్‌ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. నోటీసులు అందుకున్న కమిషనర్‌తో పాటు ఇతర అధికారులు తమ సంజాయిషీలను శుక్రవారం సమర్పించినట్లు తెలిసింది. ఈ వివరణలతో కూడిన సమగ్ర నివేదికను విచారణాధికారి అయిన అదనపు కలెక్టర్‌.. కలెక్టర్‌కు సమర్పించనున్నారు. కాగా రాజకీయంగా కొందరు ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లపై వస్తున్న ఆరోపణలకు తాము బలవుతున్నామని పలువురు అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కామారెడ్డి బల్దియా అధికారులకు షోకాజ్‌ నోటీసులు

కమిషనర్‌తో పాటు అన్ని విభాగాల

అధికారులకు..

అవినీతి, అక్రమాల ఆరోపణలపై

వివరణ ఇవ్వాలని ఆదేశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement