నాగిరెడ్డిపేట: పోచారం ప్రాజెక్టులో పూడికతీత కోసం రూ.504 కోట్లు మంజూరు చేయించినట్లు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు తెలిపారు. నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం, గోపాల్పేట, చీనూర్, రాఘవపల్లి, బొల్లారం గ్రామాల్లో శుక్రవారం ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాలను నిర్వహించారు. దీంతోపాటు గ్రామాల్లో మహిళాసంఘాల భవన నిర్మాణాల కోసం భూమిపూజ చేశారు. మాల్తుమ్మెద శివారులో రూ.15 కోట్లతో నిర్మించనున్న 20 వేల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన గోదాం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోచారం, మాల్తుమ్మెద గ్రామాల శివారులోగల 268, 834, 835, 838 సర్వే నంబర్లలో అసైన్డ్ భూములను గుర్తించేందుకు రీసర్వే చేస్తున్నారని, 15 రోజుల్లో సర్వే పూర్తవుతుందని పేర్కొన్నారు. మాల్తుమ్మెదగేట్ వద్ద బీడీ కార్మికులకు ఇళ్లస్థలాలు కేటాయించే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు సూచిస్తామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ వెంకట్‌రెడ్డి, ఎంపీడీవో గంగాధర్, ఎంపీవో ప్రభాకరచారి, ఏపీఎం దత్తు, మాల్తుమ్మెద సొసైటీ చైర్మన్ సురేందర్‌గౌడ్, సర్పంచ్‌లు మురళీమోహన్‌గౌడ్, సంజీవరావు, సాయిలు, వంశీకృష్ణగౌడ్, మల్లేశం, ప్రభుగౌడ్, నాయకులు శ్రీధర్‌గౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, ప్రభాకర్, గులాం, కిరణ్‌కుమార్, శ్రీరాంగౌడ్, లక్ష్మణ్, ఇమామ్ తదితరులు పాల్గొన్నారు.


