మండల ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఎన్నిక | - | Sakshi
Sakshi News home page

మండల ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఎన్నిక

Nov 6 2026 1:44 AM | Updated on Nov 6 2026 1:44 AM

మండల ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఎన్నిక యూత్‌ ఫెస్టివల్‌లో గురుకుల కళాశాల విద్యార్థుల ప్రతిభ తాడ్వాయి డీటీగా శృతి

నిజాంసాగర్‌: జుక్కల్‌ మండలం ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం కార్యవర్గాన్ని గురువారం జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్‌నాయక్‌ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా ఎం రవీందర్‌, ప్రధాన కార్యదర్శిగా అంజయ్య, కోశాధికారిగా రాజశేఖర్‌, జిల్లా అసోసియేట్‌ అధ్యక్షుడిగా చందర్‌, జిల్లా ఉపాధ్యక్షుడిగా రాజేశ్‌, మండల మహిళా కార్యదర్శిగా స్వరూపరాణి ఎన్నికయ్యారు. అనంతరం నియామకపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.

రామారెడ్డిలో..

రామారెడ్డి: రామారెడ్డి మండల ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షులు ఆనంద్‌, సీనియర్‌ ఉపాధ్యాయులు సత్యం, స్వామి, సాయిమౌర్యల పర్యవేక్షణలో ఈ ఎన్నికల ప్రక్రియను నిర్వహించారు. మండల అధ్యక్షుడుడిగా కే లింగం, ప్రధాన కార్యదర్శి కే బాలనర్సు, కోశాధికారిగా బీ ఆదినారాయణ, మహిళా విభాగం అధ్యక్షులుగా యు రజిత ఎన్నికయ్యారు.

సదాశివనగర్‌: మండలంలోని మర్కల్‌ గ్రామ స్టేజీ వద్ద గల మహిళ డిగ్రీ కళాశాల విద్యార్థులు జిల్లా స్థాయిలో నిర్వహించిన యూత్‌ ఫెస్టివల్‌ కార్యక్రమంలో అత్యుత్తమ ప్రతిభ చూపినట్లు ప్రిన్సిపాల్‌ శోభారాణి గురువారం తెలిపారు. నాటక ప్రదర్శనలో ప్రథమ బహుమతి, జానపద నృత్య ప్రదర్శనలో ప్రథమ బహుమతి, జానపద గాన పోటీలలో ద్వితీయ బహుమతి సాధించినట్లు ప్రిన్సిపాల్‌ పేర్కొన్నారు. ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులను అధ్యాపకులు అభినందించారు. కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ కృష్ణవేణి, కల్చరల్‌ కమిటీ కో ఆర్టినేటర్‌ వనజ, సభ్యులు నవనీత, ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.

తాడ్వాయి: డిప్యూటీ తహసీల్దార్‌గా జంగ శృతి గురువారం బాధ్యతలు చేపట్టారు. ఇటీవల నిర్వహించిన గ్రూపు–2లో ర్యాంకు సాధించింని శృతి డిప్యూటీ తహసీల్దార్‌గా సెలెక్షన్‌ అయ్యారు. దీంతో నూతనంగా తాడ్వాయికి డిప్యూటీ తహసీల్దార్‌గా వచ్చారు. తహసీల్దార్‌ శ్వేత శృతికి పుష్పగుచ్ఛం అందించి ఆహ్వానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement