గడువులోగా పనులు పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

గడువులోగా పనులు పూర్తి చేయాలి

Nov 6 2026 1:32 AM | Updated on Nov 6 2026 1:32 AM

● అధికారుల సమీక్షలో

కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌

కామారెడ్డి టౌన్‌: జిల్లాలో వివిధ శాఖల ఆధ్వర్యంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలును నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో విద్యాశాఖ, పంచాయతీరాజ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌, గృహ నిర్మాణం, భూసేకరణ, డీఆర్డీవో తదితర శాఖల పనితీరుపై ఆయన సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ..పెండింగ్‌ పనులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి వేగవంతం చేయాలన్నారు. వికసిత్‌ భారత్‌, ఉపాధి హామీ, చేయూత పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, తాగునీటి సరఫరా, మౌలిక వసతుల కల్పనలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించవద్దని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని, శాఖల మధ్య సమన్వయంతో లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఎన్‌.వై.గిరి, డీఈవో మల్లికార్జున్‌, డీఆర్డీవో దామోదర్‌రెడ్డి, గృహ నిర్మాణ శాఖ పీడీ విజయ్‌పాల్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement