● గాడిదలే ఆసరా! | - | Sakshi
Sakshi News home page

● గాడిదలే ఆసరా!

Nov 6 2026 1:32 AM | Updated on Nov 6 2026 1:32 AM

● గాడిదలే ఆసరా!

ఖరీఫ్‌ సీజన్‌లో సాగుచేసిన వరి పంట కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే కాలువలు, చెరువుల కింద వరి సాగు చేసిన రైతులకు ధాన్యం తరలింపు క్లిష్టంగా మారింది. బురద పొలాల నుంచి ట్రాక్టర్లలో ధాన్యం తరలించాలంటే చార్జీలు అధికమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటకలోని ఔరాద్‌ నుంచి వలస వచ్చిన గాడిదలే రైతులకు ఆసరాగా నిలిచాయి. పొలం నుంచి రైతు ఇంటికి లేదా కొనుగోలు కేంద్రాల వరకు ధాన్యం రవాణా చేస్తున్నాయి. గురువారం మహమ్మద్‌ నగర్‌ మండలం తుంకిపల్లి గ్రామంలో కొందరు రైతులు తమ ధాన్యాన్ని గాడిదలపై రవాణా చేస్తుండగా ‘సాక్షి’ క్లిక్‌మనిపించింది. – నిజాంసాగర్‌ (జుక్కల్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement