పెద్దకొడప్గల్: మండల కేంద్రంలోని వడ్లం జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన బామన్ బావుసింగ్ అండర్–14 విభాగం క్రీడా పోటీల్లో విశేష ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఇటీవల నిర్వహించిన హైజంప్ పోటీల్లో మొదటి స్థానం(స్వర్ణ పతకం), లాంగ్ జంప్ పోటీలలో రెండవ స్థానం సాధించి సత్తా చాటాడు. హనుమకొండ జిల్లాలో ఈ నెల 10, 11, 12వ తేదీలలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు పీడీ ధర్మేందర్ తెలిపారు. బావుసింగ్ను హెచ్ఎం, ఉపాధ్యాయులు అభినందించారు.
కబడ్డీ క్రీడాకారుడికి అభినందన
కామారెడ్డి అర్బన్: కామారెడ్డి పీఏం శ్రీ జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల క్రీడాకారుడు మహ్మద్ ఇలియాస్ ఈనెల 5, 6వ తేదీల్లో హైదరాబాద్లోని పోలీస్ అకాడమీలో నిర్వహించే రాష్ట్రస్థాయి పీఏం కబడ్డీ పోటీలకు ఎంపికై నందుకు బుధవారం అభినందించారు. కార్యక్రమంలో హెచ్ఎం మాధవి, వ్యాయామ ఉపాధ్యాయుడు హీరాలాల్, ఉపాధ్యాయుడు నవీన్ తదితరులు పాల్గొన్నారు.


