కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలో ఇందిరా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితుడిని పోలీసులు గుర్తించి శిక్షించాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. డీసీసీ మాజీ అధ్యక్షుడు కై లాస్ శ్రీనివాసరావు, పట్టణ అధ్యక్షుడు ఐరేని సందీప్ కుమార్ మాట్లాడుతూ.. ఇందిరాగాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేయడం అత్యంత హేయమైన చర్య అని మండిపడ్డారు. అనంతరం పట్టణ పీఎస్లో ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో పట్టణ మాజీ అధ్యక్షుడు పండ్ల రాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోనె శ్రీనివాస్, కౌన్సిలర్లు, నాయకులు షేరు, జావిద్, ఇప్ప శ్రీనివాస్, లడ్డు, సిద్ధిక్, అజ్మత్, ఖదీర్, విజయ్, చాట్ల రాజేశ్వర్, కాళ్ల గణేశ్, సిరాజ్, లక్కపత్ని గంగాధర్, రామ్మోహన్, సంతోష్, సుధాకర్ రెడ్డి, రెహాన్ తదితరులు పాల్గొన్నారు.


