మాతృ మరణాల నివారణకు కృషి చేయాలి | - | Sakshi
Sakshi News home page

మాతృ మరణాల నివారణకు కృషి చేయాలి

Nov 5 2026 2:04 AM | Updated on Nov 5 2026 2:04 AM

● కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌

కామారెడ్డి టౌన్‌: జిల్లాలో మాతృ మరణాలను పూర్తిగా నివారించేందుకు వైద్య ఆరోగ్య శాఖతో పాటు ఇతర సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ ఆదేశించారు. ప్రతి గర్భిణికి నాణ్యమైన వైద్య సేవలు అందించి, సురక్షిత ప్రసవాలు జరిగేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. బుధవారం కలెక్టరేట్‌ సమావేశపు హాల్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి మాతృ మరణాల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఇటీవల నమోదైన మాతృ మరణాల వివరాలు, వాటికి దారితీసిన వైద్యపరమైన, వ్యవస్థాపరమైన కారణాలను పరిశీలించారు. ప్రతి ఘటనలో చోటుచేసుకున్న లోపాలను గుర్తిస్తూ, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట కార్యాచరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గర్భం దాల్చిన ప్రారంభ దశలోనే ప్రతి మహిళ వివరాలను సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యవసర ప్రసూతి సేవలు, శస్త్రచికిత్స వసతులు, రక్త నిల్వలు నిరంతరం అందుబాటులో ఉంచాలన్నారు. డీఎంహెచ్‌వో జే వెంకటి, ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ వీఎం ఫాగ్సీ, వైద్యాధికారులు నరేందర్‌రెడ్డి, విజయకృష్ణ, రామిరెడ్డి, ఆర్‌ఎంవో డీ రవీందర్‌ గౌడ్‌, శిశు వైద్య సహాయ ఆచార్యులు పీ శిరీష తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement