● రైతులకు ఎమ్మెల్యే పోచారం
శ్రీనివాస్‌రెడ్డి సూచన
బాన్సువాడ: ఎల్‌నినో ప్రభావంతో నీటి లభ్యత లేనందున రైతులు ఆరుతడి పంటలను సాగు చేసేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బుధవారం బీర్కూర్ మండలం రైతునగర్‌లో కలెక్టర్ అశిష్ సాంగ్వాన్‌తో కలిసి పలు అభివృద్ది పనులను ప్రారంభించారు. నూతనంగా నిర్మించిన మహిళ స్వయం సహాయక సంఘ భవనాన్ని ఆహార ధాన్యాల నిల్వ ఉంచేందుకు రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతులు సాగునీరు వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని అన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం ఉన్న నీటిని తాగునీటి అవసరాల కోసం వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. తాగునీటి అవసరాల కోసమే ప్రాజెక్టు నీటిని విడుదల చేస్తారని, సాగునీటి కోసం విడుదల చేయరని వివరించారు. రైతులు పరిస్థితులను అర్థం చేసుకోవాలని, బోర్లలో నీటి లభ్యతను పరిశీలించుకుకోవాలని అన్నారు. ఆగ్రో ఇండసీ్ట్రస్ మాజీ చైర్మన్ కాసుల బాల్‌రాజ్, సర్పంచ్ నాగరాజకుమారి, ఆర్డీవో రవీందర్‌రెడ్డి, ఎంపీడీవో శ్రీనిధి, నాగేశ్వర్‌రావు తదితరులు ఉన్నారు.


