కామారెడ్డి టౌన్: హైదరాబాద్‌నుంచి నిర్మల్‌కు వెళ్తున్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌కు కామారెడ్డి శివారలో జిల్లా బీజేపీ నాయకులు మంగళవారం ఘన స్వాగతం పలికారు. ఆయన నిర్మల్‌లో చేపట్టనున్న పాదయాత్రలో పాల్గొనేందుకు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్‌లతో కలిసి వెళ్తున్నారు. కామారెడ్డి శివారులోని బైపాస్ వద్ద బీజేపీ నాయకులు వారికి స్వాగతం పలికారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు ఆధ్వర్యంలో పార్టీ కౌన్సిలర్లు, జిల్లా పదాధికారులు, నాయకులు ఆయనను సన్మానించారు. అనంతరం కేంద్ర మంత్రి పార్టీ శ్రేణులతో కొద్దిసేపు ముచ్చటించారు.


