కామారెడ్డి టౌన్ : గుజరాత్‌లోని ఏక్తా నగర్లో నిర్వహించిన సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి, రా ష్ట్రీయ ఏక్తా దివస్ పరేడ్‌లో జిల్లా ప్రతినిధులు పాల్గొనడం జిల్లాకే గర్వకారణమని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ ఎం రాజేశ్ చంద్ర అన్నారు. వేడుకల్లో పాల్గొని తిరిగి వచ్చిన 19 మంది సభ్యుల బృందం మంగళవారం కలెక్టరేట్లో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్‌ను, అలాగే జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ రాజేశ్ చంద్ర ను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఎన్ కృష్ణాగౌడ్ నోడల్ అధికారిగా వ్యవహరించిన ఈ బృందంలో నరేందర్ రెడ్డి, రాజిరెడ్డి, సంతోష్, నితిన్ గౌడ్, రోహిత్, ప్రభాస్, సాధన, రజిత, సూరజ్, లక్ష్మి, దీప, రాధ, సుబ్బారావు, లింగారెడ్డి, రాంగోపాల్ రెడ్డి, రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


