కామారెడ్డి టౌన్: క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసికోల్లాసాన్ని ఇస్తాయని ఎస్పీ రాజేశ్ చంద్ర అన్నారు. జోనల్ స్థాయి క్రికెట్ పోటీలు, ఎంపిక ప్రక్రియలో పాల్గొననున్న జిల్లా పోలీస్ క్రికెట్ జట్టు క్రీడాకారులకు మంగళవారం ఆయన క్రికెట్ జెర్సీలను ఆవిష్కరించి వారికి అందజేశారు. జోనల్ స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి జిల్లా పోలీసు విభాగానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అలాగే యువత మత్తు పదార్థాలు, ధూమపానం వంటి దురలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. ఏఎస్పీ నర్సింహారెడ్డి, సీఐలు, ఎస్సైలు, సిబ్బంది ఉన్నారు.


