రామారెడ్డి: మేడ్చల్లో ఇటీవల నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో రామారెడ్డి మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థిని పోశవ్వ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ంది. పాఠశాలలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో పోశవ్వను సర్పంచ్, ఉపాధ్యాయులు అభినందించారు. సర్పంచ్ బండి ప్రవీణ్, ఉపసర్పంచ్ నవీన్, హెచ్ఎం వేణుమాధవ్, ఉపాధ్యాయులు లింగం, ఉపాధ్యాయులు మురళీకృష్ణ, సురేశ్ బాబు, శ్రీనివాసన్, బాల్రాజు, దేవి ప్రసాద్, లక్ష్మణ్, బషీర్, స్వప్న, పద్మావతి, మంజుల, భూలక్ష్మి, క్రీడాకారులు ఉన్నారు.


