భిక్కనూరు: తెలంగాణ యూనివర్సీటీ సౌత్‌క్యాంపస్ ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారిగా జియో ఇన్‌ఫర్మెటిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నారాయణగుప్తా నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం తెయూ వీసీ యాదగిరిరావు నియామకపత్రాన్ని ఆయనకు అందజేశారు. నారాయణగుప్తా మాట్లాడుతూ.. విద్యార్థులకు సేవా కార్యక్రమం గురించి అవగాహన కల్పించడంతో పాటు సేవా దృక్పథాన్ని పెంపొందించేందుకు కృషిచేస్తానన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ యాదగిరి, ప్రిన్సిపాల్ సుధాకర్‌గౌడ్, ఎన్‌ఎస్‌ఎస్ కో–ఆర్డినేటర్ అపర్ణ పాల్గొన్నారు.
కామారెడ్డి రూరల్: క్యాసంపల్లి గ్రామంలో మహిళా సంఘ భవన నిర్మాణ పనుల్లో భాగంగా సర్పంచ్ అడపా శ్యామ్ స్లాబ్ పనులను ప్రారంభించారు. జీపీ పాలకవర్గ సభ్యులు, కార్యదర్శి చంద్రకళ, గ్రామస్తులు పాల్గొన్నారు.
కామారెడ్డి టౌన్ : మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్వహించిన కార్మికుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చనిపోయిన, 60 ఏళ్లు దాటిన కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి పనిభారాన్ని తగ్గించాలని కోరారు. నాయకులు రాజనర్సు, మహబూబ్, దీవెన, శివ, మధు, కార్మికులు పాల్గొన్నారు.
కామారెడ్డి టౌన్: తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్‌హెచ్‌ఎం) కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె మంగళవారం నాటికి 22వ రోజుకు చేరింది. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ధర్నాచౌక్‌లో ఉద్యోగులు శీర్షాసనం వేసి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. జేఏసీ నాయకులు వెంకటరమణ, వేణుమాధవ్, రాహుల్, హరీశ్, రాజశేఖర్, రవళి, స్వాతి, శోభ, యాదమ్మ, కవిత, నిర్మల, సాయమ్మ, ప్రమీల, రాజు తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి అర్బన్: కామారెడ్డి పట్టణ కౌన్సిలర్, బీఆర్‌ఎస్ నాయకుడు, అథ్లెటిక్ జీ లక్ష్మీనారాయణ మంగళవారం ఉదయం 21 కిలోమీటర్ల నాన్‌స్టాఫ్ లాంగ్ రన్‌ను గంట 52 నిమిషాల్లో పూర్తి చేశారు. కామారెడ్డి భారత్‌రోడ్డులోని తన నివాసం నుంచి ముత్యంపేట, దోమకొండ కోట, గొట్టి ముక్కుల గ్రామ శివారు వరకు 21 కిలోమీటర్లు ఆగకుండా పరుగెత్తారు. ఆరోగ్యం అందించే లక్ష్యంలో తాను పరుగు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
కామారెడ్డి టౌన్: జిల్లా అండర్–16 బాలుర 36వ సబ్ జూనియర్ కబడ్డీ జట్టు ఎంపిక పోటీలు మంగళవారం జిల్లా కేంద్రంలో నిర్వహించారు. జిల్లా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సీహెచ్ రాజన్న ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎంపికల్లో ప్రతిభ కనబరిచిన 25 మంది క్రీడాకారులను శిక్షణ శిబిరానికి ఎంపిక చేసినట్లు ప్రకటించారు. ఎంపికై న క్రీడాకారులకు తాడ్వాయి మండల కేంద్రంలో ఎనిమిది రోజుల పాటు ప్రత్యేక శిక్షణ శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం తుది జట్టు ను ఖరారు చేస్తామన్నారు. కబడ్డీ అసోసియేష న్ జిల్లా అధ్యక్షుడు బాణాల భాస్కర్ రెడ్డి, ట్రెజరర్ ఎన్ శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి పీ జగదీశ్వర్, ఈసీ సభ్యులు నాగరాజు, ప్రభు, శ్రీనివాస్, పీఈటీలు రేణుక, విజయలక్ష్మి, మహేశ్, గోపి, రామసింగ్ పాల్గొన్నారు.
తాడ్వాయి: విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ దిశగా పయనించాలని ప్రముఖ మోటివేషనల్ స్పీకర్, కవి, గేయ రచయిత శ్యామ్ కు మార్ అన్నారు. తాడ్వాయి మండల కేంద్రంలో ని బాలికల గురుకుల పాఠశాలలో మంగళవా రం కెరీర్ గైడెన్స్, జీవిత నైపుణ్యాలు, పలు అంశాలపై అవగాహన కల్పించారు. అధ్యాపకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


