భిక్కనూరు/ సదాశివనగర్/ లింగంపేట/ నాగిరెడ్డిపేట/ నిజాంసాగర్: జిల్లాలోని పలు మండలాల్లో, గ్రామాల్లో అధికారులు ఉపాధి హామీ పనులను పరిశీలించారు. సిబ్బంది పలు సూచనలు చేశారు. భిక్కనూరు మండలం తిప్పాపూర్‌లో కొనసాగుతున్న ఉపాధి పనులను ఎంపీడీవో సవిత మంగళవారం పరిశీలించారు. భవిష్యత్తు బాగు కోసం ప్రతి ఒక్కరూ ఇంటికి ఇంకుడు గుంతను నిర్మించుకోవాలని సూచించారు. అనంతరం వ్యవసాయ క్షేత్రాల్లో నిర్మిస్తున్న పంట కుంటలను పరిశీలించారు. సర్పంచ్ కుంట లింగారెడ్డి, వార్డు సభ్యుడు నర్సారెడ్డి, సిబ్బంది ఉన్నారు. సదాశివనగర్ మండలం మోడేగాం గ్రామంలో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులు, ఇందిరమ్మ గృహాల నిర్మాణం, అంగన్‌వాడీ భవన నిర్మాణ పనులను మండల ప్రత్యేక అధికారి అశోక్ పరిశీలించారు. ఎంపీడీవో సంతోష్ కుమార్, సర్పంచ్ గంగాధర్, ఏపీవో శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. లింగంపేట మండలం గాంధీనగర్ శివారులో చేపడుతున్న ఉపాధి పనులను ఎంపీడీవో పరిశీలించారు. ప్రతీ కూలీకి 125 రోజులు పనులు కల్పించాలని అన్నారు. అటవీ ప్రాంతంలో హద్దులను ఏర్పాటు చేస్తున్న పనులను పరిశీలించారు. ఎంపీవో మలహరి, సర్పంచ్ బాబు, ఏపీఎంలు వినోద్‌కుమార్, నరేందర్ తదితరులు ఉన్నారు. నాగిరెడ్డిపేట మండలంలోని బొల్లారంలో ఉపాధి హామీ పనులను మండల ప్రత్యేకాధికారి రాజ్‌కుమార్ పరిశీలించారు. అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఎంపీడీవో గంగాధర్, ఏపీవో సక్కుబాయి, సర్పంచ్ ప్రభుగౌడ్, జీపీ కార్యదర్శి సంతోష్, ఫీల్డ్‌అసిస్టెంట్ పర్వీన్ తదితరులు ఉన్నారు. మహమ్మద్‌నగర్ మండలం బూర్గుల్ శివారులో ఉపాధి పనులను మండల ప్రత్యేక అధికారి ప్రసాద్‌రావు పరిశీలించారు. సర్పంచ్ గజ్జల జీవన్, ఉప సర్పంచ్ గొల్ల రమ్యశ్రీ, ఎంపీడీవో అనిత, జీపీ కార్యదర్శి రవీందర్ తదితరులు ఉన్నారు.


