జీవాలకు నట్టల నివారణ మందు వేయించాలి | - | Sakshi
Sakshi News home page

జీవాలకు నట్టల నివారణ మందు వేయించాలి

Nov 4 2026 1:38 AM | Updated on Nov 4 2026 1:38 AM

ఎల్లారెడ్డిరూరల్‌/ రామారెడ్డి/ బాన్సువాడ రూరల్‌/ లింగంపేట/ నాగిరెడ్డిపేట: పశువులకు నట్టల నివారణ మందులను పెంపకందారులు తప్పకుండా వేయించాలని అధికారులు, ప్రజాప్రతినిధులు సూచించారు. జిల్లాలోని పలు మండలాలు, గ్రామాల్లో జీవాలకు నట్టల నివారణ మందులు వేశారు. ఎల్లారెడ్డి మండలంలోని అన్నాసాగర్‌ గ్రామంలో పశువులకు నట్టల నివారణ మందులను సర్పంచ్‌ వేశారు. వెటర్నరీ వైద్యురాలు అర్చన, ఉపసర్పంచ్‌ నాగరాజు, సిబ్బంది శ్రీనివాస్‌ రెడ్డి, సయ్యద్‌ మహబూబ్‌, రైతులు నారాయణ రెడ్డి, సాయాగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. రామారెడ్డి మండల కేంద్రంలో మండల పశువైద్యాధికారి రాంచందర్‌ సర్పంచ్‌ బండి ప్రవీణ్‌, ఉపసర్పంచ్‌ నవీన్‌తో కలిసి జీవాలకు నట్టల నివారణ మందులు వేశారు. బాన్సువాడ మండలం సోమేశ్వర్‌లో పశువైద్య సిబ్బంది నట్టల నివారణ మందులు అందించారు. సర్పంచ్‌ చింత్‌వార్‌ వీరేశం, ఉప సర్పంచ్‌ నూరున్సీ రషీద్‌, వార్డు సభ్యులు సుధాకర్‌, లక్ష్మీనారాయణ, సిబ్బంది మహిబూబ్‌, గోపాలమిత్రలు పాల్గొన్నారు.

లింగంపేట మండలంలోని భవానీపేట, ముంబోజిపేట, ముంబోజిపేట తండా, కొండాపూర్‌తండా గ్రామాల్లో మండల పశువైద్యాధికారి హనాజోనస్‌ పశువులకు నట్టల నివారణ మందులు వేశారు. నాగిరెడ్డి మండలంలోని నాగిరెడ్డిపేట, చీనూర్‌, వాడి గ్రామాల్లో పశువైద్య సిబ్బంది దూడలకు మందులు వేశారు. మండల పశువైద్యాధికారి రవికుమార్‌, నాగిరెడ్డిపేట సర్పంచ్‌ మన్నె వెంకట్‌, ఉపసర్పంచ్‌ బాలాజీ శ్రీకాంత్‌, పశువైద్య సిబ్బంది విజయ, గంగారాం, జయరాజ్‌, పశుమిత్ర శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement