మానవహారంతో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల నిరసన | - | Sakshi
Sakshi News home page

మానవహారంతో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల నిరసన

Nov 3 2026 1:21 AM | Updated on Nov 3 2026 1:21 AM

కామారెడ్డి టౌన్‌: తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ జిల్లా కేంద్రంలో జాతీయ ఆరోగ్య మిషన్‌(ఎన్‌హెచ్‌ఎం) కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె సోమవారానికి 21వ రోజుకు చేరింది. ప్రభుత్వం అనుసరిస్తున్న మొండివైఖరిని నిరసిస్తూ ఉద్యోగులు పట్టణంలోని ధర్నా చౌక్‌లో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్‌ నుంచి నిజాంసాగర్‌ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. రైల్వే బ్రిడ్జి వద్ద గల అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. అనంతరం నిజాంసాగర్‌ చౌరస్తాలో ఎన్‌హెచ్‌ఎం అక్షరాల ఆకారంలో కూర్చొని మానవహారంతో రాస్తారోకో చేపట్టారు. ప్రభుత్వం తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. జిల్లా జేఏసీ ప్రధాన కార్యదర్శులు బట్టు పద్మజ, బొల్లు సందీప్‌, వైద్యులు, నాయకులు వెంకటరమణ, అశ్విని, మారుతి, హరీష్‌, వేణుమాధవ్‌, రాహుల్‌, మీనాక్షి, స్వాతి, మౌనిక, అఖిల్‌, సాగర్‌, జ్యోతి, మంజుల, నిశాంతిని, విమల, గంగమణి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement