ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించాలి

Nov 3 2026 1:21 AM | Updated on Nov 3 2026 1:21 AM

ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించాలి కళాశాల తనిఖీ ఒకరికి రెండు రోజుల జైలు

రాంజంపేట(భిక్కనూరు): సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజలకు అత్యుత్తమ సేవలను అందించాలని ఎస్పీ రాజేష్‌చంద్ర అన్నారు. రాజంపేట మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను సోమవారం ఆయన తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పోలీసులు ప్రజలతో స్నేహితుల మాదిరిగా ఉండి శాంతి భద్రతల పరిరక్షణకు వారి సహకారం తీసుకోవాలన్నారు. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషిచేయాలన్నారు. పాత నేరస్తులు, రౌడీషీటర్ల కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. భిక్కనూరు సీఐ జగడం నరేష్‌, ఎస్సై భువనేశ్వర్‌ ఉన్నారు.

కామారెడ్డి టౌన్‌: జిల్లా కేంద్రంలోని శ్రీ ఆర్యభట్టా జూనియర్‌ కళాశాలను సోమవారం ఇంటర్మీడియట్‌ జిల్లా నోడల్‌ అధికారి షేక్‌ సలాం తనిఖీ చేశారు. క్లాస్‌రూమ్‌లలో విద్యార్థులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సబ్జెక్టులపై ప్రశ్నలు అడిగారు. విద్యార్థుల సమగ్ర విద్యాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేసి, నాణ్యమైన విద్యను అందించేలా అధ్యాపకులు కృషి చేయాలని సూచించారు. కళాశాల కరస్పాండెంట్‌ కేశిరెడ్డి గురువెందర్‌ రెడ్డి, ప్రిన్సిపాల్‌ హనుమంతరావు, అధ్యాపకులు పాల్గొన్నారు.

నాటుబాంబుల కలకలం!

నిజాంసాగర్‌(జుక్కల్‌): మండలంలోని అచ్చంపేట గ్రామ శివారులో అడవి పందులను హతమార్చేందుకు గుర్తు తెలియని వ్యక్తులు నాటు బాంబులు అమరుస్తున్నారు. రెండు రోజులుగా రాత్రి వేళలో నాటు బాంబులు పేల్చుతుండడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. శని, ఆదివారాల్లో బాంబులు పేలి నాలుగు అడవి పందులు మృత్యువాతపడ్డాయని తెలుస్తోంది. గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి నాటు బాంబులు పెడుతూ అటవి జంతువులను హతమారుస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. దీనిపై పోలీసులు దృష్టి సారించాలని కోరుతున్నారు.

నిజామాబాద్‌ అర్బన్‌: రెండో టౌన్‌ పరిధిలో ఒకరికి రెండు రోజుల జైలు శిక్ష విధించినట్లు ఎస్సై యాదగిరి తెలిపారు. కుటుంబ వ్యవహారంలో గొడవకు దారితీయడం, పోలీస్‌స్టేషన్‌కు వచ్చి గొడవ సృష్టించడంలో విజయ్‌కుమార్‌ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టగా జడ్జి రెండు రోజుల జైలు శిక్ష విధించినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement