గొంతునులిమి.. ప్రాణం తీసి | - | Sakshi
Sakshi News home page

గొంతునులిమి.. ప్రాణం తీసి

Nov 3 2026 1:21 AM | Updated on Nov 3 2026 1:21 AM

● ఐదేళ్ల బాలుడి హత్య

● సహజీవనానికి అడ్డుగా ఉన్నాడని ఘాతుకం

● హైదరాబాద్‌లో ఘటన

● మృతుడు నిజామాబాద్‌ వాసి

రహమత్‌నగర్‌: సహజీవనానికి అడ్డుగా ఉన్నాడని ఐదేళ్ల బాలుడి గొంతునులిమి అత్యంత దారుణంగా ప్రాణం తీశాడు.. ఓ కిరాతకుడు. రాత్రంతా గదిలోనే ఉండి తెల్లవారుజామున తల్లి వచ్చాక నిలదీయడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. హైదరాబాద్‌లోని బోరబండ ఎస్‌హెచ్‌వో రవికుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్‌కు చెందిన పవార్‌ దుర్గ(23) భర్త మధు కొంతకాలం క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో ఓ కుమారుడు, కుమార్తెను నిజామాబాద్‌లో ఉంటున్న బావ వద్ద ఉంచి.. హృద్రోగ సమస్యతో బాధపడుతున్న చిన్న కొడుకు విజయ్‌(5)తో కలిసి దుర్గ బోరబండలో ఉండేది. ఫుట్‌పాత్‌పై ఇనుప వస్తువులు తయా రు చేసే దుకాణంలో పనిచేసేది. ఈ క్రమంలో నిజామాబాద్‌కు చెందిన నల్లవరపు విద్యాసాగర్‌(33)కు ఆమెతో పరిచయం ఏర్పడింది. నాలుగు నెలల క్రితం బోరబండ అజాంనగర్‌ బీబ్లాక్‌లో ఇల్లు అద్దె కు తీసుకొని సహజీవనం చేస్తున్నారు. ఆమె ప్రయివేటు ఆస్పత్రిలో ఉద్యోగం చేస్తుండగా.. అతడు పని వదిలేసి మద్యం తాగు తూ ఇంట్లోనే ఉండేవా డు. దుర్గ ఇంట్లో లేని సమయంలో బాలుడిని తరచూ కొట్టేవాడు. ఆ దివారం సాయంత్రం విజయ్‌ని ఇంట్లోనే వది లి తల్లి నైట్‌ డ్యూటీకి వెళ్లింది. మద్యం మత్తు లో ఇంటికి వచ్చిన విద్యాసాగర్‌ నిద్రిస్తున్న విజయ్‌ గొంతు నులిమి తీవ్రంగా కొట్టాడు. దీంతో బాలుడు ప్రాణాలు వదిలాడు. ఇంట్లోనే రాత్రంతా ఉన్నాడు. అనంతరం ఏమీ తెలియనట్లు దుర్గ పనిచేసే ఆస్పత్రికి ఫోన్‌ చేసి విజయ్‌కు ఫిట్స్‌ వచ్చి కిందపడిపోయాడని చెప్పాడు. ఆమె ఇంటికి వచ్చి చూడగా విజయ్‌ చనిపోగా.. మెడపై గాయాలు కనిపించాయి. విద్యాసాగర్‌ను నిలదీయడంతో తలుపు మూసి ఆమె గొంతు నులిమే ప్రయత్నం చేశాడు. ఆమె అరుపులు విన్న చుట్టుపక్కల వారు రావడంతో పారిపోయాడు. జూబ్లీహిల్స్‌ డీసీపీ రమణారెడ్డి, ఎస్‌ఆర్‌ నగర్‌ ఏసీపీ రాఘవేంద్రరావు, బోరబండ ఎస్‌హెచ్‌వో రవికుమార్‌ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేశారు. నిందితుడిని పట్టుకుంటామని ఎస్‌హెచ్‌వో స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement