ఎర్రమన్నుకుచ్చలో ఏం జరుగుతోంది? | - | Sakshi
Sakshi News home page

ఎర్రమన్నుకుచ్చలో ఏం జరుగుతోంది?

Nov 3 2026 1:21 AM | Updated on Nov 3 2026 1:21 AM

● నాటు బాంబుల తయారీపై పట్టింపేది..

● పోలీసులకు ఫిర్యాదు చేసినా

చర్యలకు వెనుకడుగు

బాన్సువాడ: బాన్సువాడ పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్న ఎర్రమన్నుకుచ్చ కాలనీలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై స్థానికులు భయాందోళన చెందుతున్నారు. కొన్నేళ్ల నుంచి కాలనీలో కొందరు వ్యక్తులు నాటు బాంబులు తయారు చేస్తున్నా పోలీసులు పట్టించుకోలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏడాది క్రితమే కాలనీవాసులు పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడంతోనే ఆదివారం ప్రమాదానికి దారితీసిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

వృత్తిగా అడవి పందుల వేట..

ఎర్రమన్నుకుచ్చలో నిర్మించిన డబుల్‌ బెడ్రూం ఇళ్లను తాడ్కోల్‌ పంచాయతీ పరిధిలోని రాజరాం దుబ్బా, తాడ్కోల్‌లో నివాసముంటున్న నిరుపేదలకు కేటాయించారు. రాజారాం దుబ్బా నుంచి వచ్చిన కొందరు వ్యక్తులు అడవి పందుల వేట

సాగిస్తున్నారు. వేట కోసం ఉపయోగించే నాటు బాంబులను స్వయంగా వారే తయారు చేసి అడవి పందులను వేటాడి చంపి వాటి కళేబరాలను కాల్చి విక్రయిస్తుంటారు.

మరికొన్ని ఇళ్లలో నాటుబాంబులు..

నాటుబాంబుల తయారీపై గతంలో కాలనీకి చెందిన కొందరు యువకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. ఆదివారం ఘటనా స్థలానికి వెళ్లిన డీఎస్పీ విఠల్‌రెడ్డికి మరోసారి కాలనీవాసులు ఫిర్యాదు చేశారు. అయితే కాలనీలోని మరికొన్ని ఇళ్లలోనూ నాటు బాంబులు ఉన్నాయని, తనిఖీలు చేస్తే బయటపడతాయని పేర్కొనడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement