రంగంలోకి వ్యవసాయ శాఖ.. | - | Sakshi
Sakshi News home page

రంగంలోకి వ్యవసాయ శాఖ..

Nov 3 2026 1:15 AM | Updated on Nov 3 2026 1:15 AM

రంగంలోకి వ్యవసాయ శాఖ.. ఖరీఫ్‌లో అన్నీ కష్టాలే...

కరువు కారణంగా దెబ్బతిన్న పంటల వివరాలను సేకరించి రైతు భరోసా యాప్‌లో క్రాప్‌ డ్యామేజీ కాలమ్‌లో నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖను ఆదేశించింది. క్షేత్ర స్థాయిలో పరిశీలించి పంట నష్టం వివరాలను సేకరించాలని స్పష్టం చేసింది. దీనికి ఈనెల 10వ తేదీని గడువుగా నిర్ణయించినట్లు వ్యవసాయ శాఖ వర్గాల ద్వారా తెలిసింది. ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటించిన ప్రాంతాల్లోనే కాకుండా అన్ని మండలాల్లోనూ సర్వే జరగనుంది.

జిల్లాలో వానాకాలం సీజన్‌లో అన్ని పంటలు కలిపి 5.53 లక్షల ఎకరాలలో సాగయ్యాయి. ఇందులో 3.19 లక్షల ఎకరాల్లో వరి సాగవగా.. 87,736 ఎకరాల్లో సోయా, 45,864 ఎకరాల్లో పత్తి, 48 వేల ఎకరాల్లో కంది, 47 వేల ఎకరాల్లో మక్క పంటలు సాగయ్యాయి. ఈ సీజన్‌లో రైతులు అనేక కష్టాలు ఎదుర్కొన్నారు. ఒకటి రెండుసార్లు మినహా పెద్ద వర్షాలు కురవలేదు. కొన్ని ప్రాంతాల్లో వాగులు పొంగినా వరుసగా పదిహేను ఇరవై రోజుల పాటు వానలు పడకపోవడంతో భూగర్భజలాల పెద్దగా వృద్ధి చెందలేదు. ఎండాకాలాన్ని మరిపించేలా భానుడు ప్రతాపం చూపడంతో భూగర్భజలమట్టం వేగంగా పడిపోయింది. సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో సరైన వర్షాలు కురవలేదు. వరి పొట్టదశలో ఉన్న సమయంలో తెగుళ్లు ఒకవైపు ఇబ్బంది పెట్టగా.. ఎండలు మరోవైపు దెబ్బతీశాయి. కరెంటు సమస్య కూడా ప్రభావం చూపింది. కీలకమైన సమయంలో అధిక లోడు పేరుతో కోతలు విధించారు. దీంతో పారిన మడులే పారి చాలాచోట్ల పంటకు నీరందలేదు. కొందరు రైతులు ట్యాంకర్లు, జనరేటర్ల ద్వారా పంటలకు నీరందించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. పత్తి పంట సాగు చేసిన రైతులు మరిన్ని ఇబ్బందులు పడ్డారు. పంట బాగుందనుకున్న సమయంలో పూత, కాత సరిగా రాకపోవడంతో చాలామంది రైతులు నష్టపోయారు. సోయా పంట కూడా చాలా ప్రాంతాల్లో దెబ్బతింది.

దెబ్బతిన్న పంటల వివరాలు సేకరించాల న్న ప్రభుత్వ ఆదేశాలతో వ్యవసాయ అధికారులు రంగంలోకి దిగారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద వ్యవసాయ శాఖ సహాయ సంచాలకుల పరిధిలోని 104 క్లస్టర్లలో దెబ్బతిన్న పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, వివరాలను రైతు భరోసా యాప్‌లోని క్రాప్‌ డ్యామేజీ కాలమ్‌లో ఫొటోలతోసహా నమోదు చేయనున్నారు. అయితే నిబంధనల ప్రకారం 33 శాతానికిపైగా దెబ్బతిన్న పంటల వివరాలనే యాప్‌లో నమోదు చేస్తారు. దీనిపై జిల్లా అధికారులు ఇప్పటికే వ్యవసాయ విస్తీర్ణాధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

జిల్లాలో ఇప్పటికే నాలుగింటిని మధ్యస్థ కరువు మండలాలుగా ప్రకటించారు. అయితే దాదాపు జిల్లాలోని అన్ని మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. వేలాది బోర్లు ఎత్తిపోయాయి. పంటలు చాలాచోట్ల దెబ్బతిని రైతులు పెట్టుబడులు నష్టపోయారు. దీంతో ఖరీఫ్‌లో జరిగిన నష్టానికి సాయం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కరువు తీవ్రతను అంచనా వేయడానికి దెబ్బతిన్న పంటల లెక్కలు తీస్తుండడంతో వారిలో ఆశలు చిగురిస్తున్నాయి. పంటలు నష్టపోయిన రైతులకు ఆర్థిక సాయం అందించాలని కోరుతున్నారు.

దెబ్బతిన్న పంటల వివరాల

సేకరణకు సర్కారు ఆదేశం

రైతుభరోసా యాప్‌లోని

క్రాప్‌ డ్యామేజీ కాలమ్‌లో వివరాలు..

ఈనెల 10 వరకు గడువు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement