● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి టౌన్: గిరిజనుల ఘన చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, దేశ స్వాతంత్య్ర పోరాటంలో వారి పాత్రను భావితరాలకు చాటిచెప్పేలా జిల్లావ్యాప్తంగా ‘జనజాతీయ గౌరవ దివస్’ను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వేడుకలకు సంబంధించిన వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుడు భగవాన్ బిర్సా ముండా చేసిన పోరాటాలు, త్యాగాలు, గిరిజన సమాజ అభ్యున్నతికి ఆయన చేసిన నిస్వార్థ కృషిని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలన్నారు. 15వ తేదీ వరకు అన్ని విద్యాసంస్థలు, వసతి గృహాలు, గిరిజన ఆవాసాలలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఈనెల 15న బిర్సా ముండా జయంతిని పురస్కరించుకుని ప్రధాన వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, డీఆర్‌డీవో దామోదర్‌రెడ్డి, జిల్లా పరిషత్ సీఈవో చందర్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ముకుందరెడ్డి, డీఈవో మల్లికార్జున్, డీఎంహెచ్‌వో వెంకట్, డీఆర్‌వో పాండు, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి సౌజన్య తదితరులు పాల్గొన్నారు.


