సాక్షి నెట్‌వర్క్: నవరాత్రులు విశేష పూజలందుకున్న బొజ్జ గణపయ్య.. గంగమ్మ ఒడికి చేరాడు. జిల్లాలో శుక్రవారం ప్రారంభమైన వినాయక విగ్రహాల నిమజ్జన శోభాయాత్ర కనులపండువగా సాగింది. నగరంలో వరుసగా కదులుతున్న గణనాథులను చూడడానికి వేలాది మంది తరలివచ్చారు. నిమజ్జనం జరిగే వినాయకుల బావి వద్ద మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్ శాఖల ఆధ్వర్యంలో పటిష్ట ఏర్పాట్లు చేశారు. నిమజ్జన ప్రక్రియ వేగవంతంగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టారు. ఉంచారు. శోభాయాత్ర, నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో ముగిసేలా జిల్లా పోలీస్ యంత్రాంగం పకడ్బందీ బందోబస్తు నిర్వహించింది.
నగరంలో శుక్రవారం నిర్వహించిన గణే శ్ నిమజ్జన శోభాయాత్రలో ఎన్‌సీసీ 12 తెలంగాణ బెటాలియన్ కమాండర్ కల్నల్ ప్రియాజిత్ సూర్ ఆదేశాల మేరకు పోలీస్ శాఖకు సహకరిస్తూ, జి ల్లాలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల, సీఎస్‌ఐ. కళాశాల, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలకు చెందిన ఎ న్‌సీసీ కెడెట్లు, అధికారులు లెఫ్టినెంట్ రామస్వా మి, కెప్టెన్ రాజేశ్వర్, నరేష్ బందోబస్తు విధుల్లో పాల్గొన్నారు. పోలీస్ శాఖకు ఎన్ సీసీ కెడెట్లు తమ సహకారాన్ని అందించారు. వారి సేవలను సీపీ సాయి చైతన్య అభినందించారు.


