గంగిరెద్దుపై శునకం రాజభోగం | - | Sakshi
Sakshi News home page

గంగిరెద్దుపై శునకం రాజభోగం

Sep 26 2026 1:08 AM | Updated on Sep 26 2026 1:08 AM

గంగిరెద్దుపై శునకం రాజభోగం

రామారెడ్డి (ఎల్లారెడ్డి): ‘దసరా, సంక్రాంతి వంటి పెద్ద పండుగలు వచ్చాయంటే గ్రామాల్లో కోలాహలం మొదలవుతుంది. ఆ కోలాహలాన్ని మరింత పెంచేందుకు, ’బొమ్మలక్కో... బొమ్మలక్క’ అంటూ గంగిరెద్దులను ఆడించేవారు భాగవతులు. ఈక్రమంలో శుక్రవారం తమ జీవనాధారమైన ఎద్దులతో పాటు, తమకు తోడుగా ఉండే శునకాలను కూడా వారు తమ వెంట తీసుకువెళ్తున్నారు. కామారెడ్డి వైపు నుంచి రామారెడ్డి గ్రామానికి వస్తున్న ఒక గంగిరెద్దుపై, వారు మోస్తున్న రంగురంగుల దుప్పట్లు, సామగ్రితో పాటు, వారి పెంపుడు కుక్క కూడా చాలా రాజసంగా ఆ ఎద్దుపై కూర్చుని ప్రయాణిస్తోంది. ఈ చిత్రాన్ని శుక్రవారం ‘సాక్షి’కి చిక్కింది. ఎద్దు నడుస్తుంటే, కుక్క ఏమాత్రం భయపడకుండా, తన ప్రయాణాన్ని ఆస్వాదిస్తూ కనిపించింది.

డీజేకు అనుమతి ఇవ్వలేదని ట్యాంకు ఎక్కిన యువకుడు

రామారెడ్డి (ఎల్లారెడ్డి): వినాయక శోభాయాత్రలో డీజేలకు అనుమతించడంలేదని ఓ యువకుడు వాటర్‌ ట్యాంకు ఎక్కి హల్‌చల్‌ చేసిన ఘటన రామారెడ్డి మండలం పోసానిపేట్‌లో గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా.. పోసానిపేట గ్రామంలో గురువారం వినాయక నిమజ్జన శోభాయాత్ర ప్రారంభమై శుక్రవారం రాత్రి వరకు కొనసాగింది. ఈక్రమంరలో గ్రామానికి చెందిన చెల్మెటి మహేష్‌(35) అనే యువకుడు డీజేలకు అనుమతిలేకపోవడంతో గ్రామంలోని వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి నిరసన తెలిపాడు. ఘటన స్థలానికి రూరల్‌ సీఐ శ్రీధర్‌గౌడ్‌, రామారెడ్డి ఎస్సై మురళి చేరుకుని మహేష్‌ను సముదాయించి కిందకు దించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement