సామూహిక వందేమాతరం గీతాలాపన | - | Sakshi
Sakshi News home page

సామూహిక వందేమాతరం గీతాలాపన

Sep 26 2026 1:08 AM | Updated on Sep 26 2026 1:08 AM

ఎల్లారెడ్డిలో గీతాలాపన చేస్తున్న నాయకులు, పాత బాన్సువాడలో.. విద్యార్థులు, గ్రామ పెద్దలు

ఎల్లారెడ్డి/ బాన్సువాడ: ఎల్లారెడ్డిలో వీహెచ్‌పీ, సరస్వతి శిశుమందిర్‌ ఆధ్వర్యంలో శుక్రవారం వందేమాతరం గీతం సామూహికంగా ఆలాపన చేశారు. వందేమాతరం గీతం 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఎల్లారెడ్డిలో విశ్వహిందు పరిషత్‌ ఆధ్వర్యంలో గాంధీచౌక్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి వందేమాతరం గీతాన్ని ఆలపించారు. కార్యక్రమంలో వీహెచ్‌పీ నాయకులు, శిశుమందిర్‌ ఆచార్యులు కిరణ్‌, నాగరాజు, నవీన్‌ తదితరులు పాల్గొన్నారు. బాన్సువాడ పట్టణంలోని పాత బాన్సువాడ చావిడి వద్ద సరస్వతి శిశు మందిర్‌ విద్యార్థులు, గ్రామ పెద్దలు వందేమాతం ఆలపించారు. వందేమాతం విశిష్టతను విద్యార్థులకు వివరించారు. పాఠశాల హెచ్‌ఎం నాగిరెడ్డి, గ్రామ పెద్దలు నాగులగామ వెంకన్న, సూర్యకాంత్‌రావు, గాజుల రాజులు, కోనాల గంగారెడ్డి, గుడాల నగేశ్‌, రాంరెడ్డి, అశోక్‌రెడ్డి, పాశం భాస్కర్‌రెడ్డి, చీకట్ల రాజు, మోహన్‌రెడ్డి, పుట్టి సాయిలు, గాండ్ల కృష్ణ, విఠల్‌రెడ్డి, బత్తిని సురేశ్‌, గొల్ల వెంకటి, రాము తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement