లింగంపేట: విద్యార్థులు నెల వారిగా సామర్థ్యాలు సాధించేలా చూడాలని ఎంఈవో అంజల్‌రెడ్డి సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. విద్యా ప్రమాణాలు మెరుగుపడేలా చూడాల్సిన బాధ్యత ప్రతి ఉపాధ్యాయుడిపై ఉందన్నారు. నాస్ నేషనల్ అచీవ్‌మెంట్ సర్వే విద్యార్థుల సమార్థ్యాలను, ఉపాధ్యాయుడి బోధనా స్థాయిని అంచనా వేస్తుందన్నారు. ప్రతీ ఏటా ఈ పరీక్షను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పాఠశాలల రిపోర్టులను ఎప్పటికప్పుడు ఎమ్మార్సీకి అందజేయాలని సూచించారు. అనంతరం నల్లమడుగు కాంప్లెక్స్ హెచ్‌ఎం కోటేశ్వర్‌రావు గ్రాంట్స్ గురించి వివరించారు. పాఠశాలలకు వచ్చిన గ్రాంట్స్ గైడ్ లైన్స్ ప్రకారం ఖర్చు చేయాలని సూచించారు. కార్యక్రమంలో బాలుర ఉన్నత పాఠశాల కాంప్లెక్స్ హెచ్‌ఎం వహీద్‌సిద్ధికీ, కృష్ణప్రసాద్, ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు, ఎమ్మార్సీ సిబ్బంది, సీఆర్పీలు తదితరులు పాల్గొన్నారు.


