తాడ్వాయి(ఎల్లారెడ్డి): ఫార్మర్ రిజిస్ట్రేషన్, పంటల సాగు వివరాల సేకరణ కోసం ప్రారంభమైన డిజిటల్ క్రాప్ సర్వేను ముమ్మరం చే యాలని వ్యవసాయ శాఖ జిల్లా అధికారి మో హన్ రెడ్డి అన్నారు. తాడ్వాయి మండలంలోని బ్రహ్మాజివాడి గ్రామంలో శు క్రవారం ఆయన పర్యటించారు. అనంతరం రైతువేదికలో మా ట్లాడుతూ రైతులు ఏ పంటను, ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారనే వివరాలను ఏఈవోల పర్యవేక్షణలో సర్వేయర్లు ప్రత్యేక మొబైల్ యా ప్ ద్వారా నమో దు చేయాలన్నారు. రైతులు తప్పనిసరిగా పంటలను నమోదు చేయించుకోవాలని సూ చించారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పేర్కొన్నారు. ఆయన వెంట వ్యవసాయ విస్తరణ అధికారి దేవేందర్, ప్రజాప్రతినిధులు, రైతులు ఉన్నారు.
సదాశివనగర్(ఎల్లారెడ్డి): ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తోందని జిల్లా విద్యాశాఖ అధికారి మల్లికార్జున్ పేర్కొన్నారు. సదాశివనగర్ మండల కేంద్రంలోని ఎమ్మార్సీ, ఉన్నత పాఠశాలను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించారు. అనంతరం ఉన్నత పాఠశాల విద్యార్థులతో మాట్లాడారు. వెనుకబడ్డ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఎస్సెస్సీ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. ఆయన వెంట ఎంఈ వో యోసెఫ్, హెచ్‌ఎం శోభారాణి, సీఆర్పీ లు నందురావు, ఉపాధ్యాయులు ఉన్నారు.
నేడు ఉమ్మడి జిల్లా షటిల్
బ్యాడ్మింటన్ పోటీలు
కామారెడ్డి అర్బన్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్) ఆధ్వర్యంలో శనివారం ఉద యం గంటలకు కామారెడ్డి భవానీరోడ్డులో ని ఖేలో ఇండియా బ్యాడ్మింటన్ అకాడమీలో ఉమ్మడి జిల్లా స్థాయి అండర్–14 బాలబాలి కల షటిల్ బ్యాడ్మింటన్ ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా కార్యదర్శి ఈ. శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. 1 జనవరి 2013 త ర్వాత జన్మించిన, 6 నుంచి 10వ తరగతి చ దువుతున్న క్రీడాకారులు పాల్గొనాలని కోరా రు. పూర్తి వివరాలకు 94409 26006, 9440 004112 నంబర్లలో సంప్రదించాలన్నారు.
మద్నూర్(జుక్కల్): ‘క్లాస్ రూంలో కాంచన’ అనే శీర్షికతో ఈ నెల 24న సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. మండల కేంద్రంలోని రాంసుఖ్ బాల్‌ముకుంద్ ఇనానీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం జిల్లా ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం విచారణ చేపట్టారు. అధ్యాపకులతోపాటు ప్రిన్సిపల్ పాండురంగతో మాట్లాడారు. సినిమా ప్రదర్శించిన మాథ్స్ లెక్చరర్‌పై తీవ్రంగా మండిపడ్డారు. సినిమా చూపించిన లెక్చరర్‌కు షోకాజ్ నోటీసులు అందించారు. ఇక నుంచి తప్పు జరగకుండా చూస్తామని లెక్చరర్‌లు వివరణ ఇచ్చినట్లు నోడల్ అధికారి తెలిపారు.
భిక్కనూరు: భారతీ య వైమానిక దళం(ఐఏఎఫ్) ఉద్యోగానికి మండల కేంద్రానికి చెందిన ముదాం రో హన్ ఎంపికయ్యారు. భిక్కనూరుకు చెందిన ముదాం బాబు కవితల కుమారుడు రోహన్ కామారెడ్డిలో బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సు పూర్తి చేసి బెంగళూరులో ప్రత్యేక కోచింగ్ తీసుకున్నారు. ఐఏఎఫ్ రిక్రూట్‌మెంట్ టెస్టులో అర్హత సాధించి మెడికల్ అసిస్టెంట్ పోస్టుకు ఎంపికయ్యారు. శుక్రవారం రాజస్థాన్ రాష్ట్రం జైపూర్‌లోని వైమానిక కార్యాలయంలో విధుల్లో చేరాడు. భిక్కనూరు మండల కేంద్రం నుంచి ఐఏఎఫ్‌లో ఉద్యోగం సాధించిన తొలి యువకుడిగా రోహన్ నిలిచాడు. ఈ సందర్భంగా రోహన్ ‘సాక్షి’తో మాట్లాడుతూ తాను చిన్నతనం నుంచి కలలు కన్న వైమానికదళంలో చేరడం సంతోషంగా ఉందని తెలిపారు.


