గణపయ్య వెడలె.. గంగమ్మ చెంతకు | - | Sakshi
Sakshi News home page

గణపయ్య వెడలె.. గంగమ్మ చెంతకు

Sep 26 2026 1:02 AM | Updated on Sep 26 2026 1:02 AM

● నిజామాబాద్‌లో ఘనంగా

వినాయక నిమజ్జనం

● కనుల పండువగా శోభాయాత్ర

నిజామాబాద్‌ రూరల్‌: భక్తుల విశేష పూలందుకున్న గణనాథుడు గంగమ్మ చెంతకు చేరుకున్నాడు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంతోపాటు బోధన్‌, ఆర్మూర్‌ పట్టణాలు, గ్రామాల్లో నిమజ్జనం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. శుక్రవారం మధ్యాహ్నం 2గంటలకు జిల్లా కేంద్రంలోని దుబ్బ సార్వజనిక్‌ గణేశ్‌ మండలి ఆధ్వర్యంలో నిమజ్జన రథయాత్ర ప్రారంభమైంది. పీసీసీ చీఫ్‌, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్‌, అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ తదితరులు రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించి శోభాయాత్రను ప్రారంభించారు. భక్తులు తాళ్లతో రథాన్ని లాగారు. భక్తుల జయజయధ్వనాల మధ్య దుబ్బ నుంచి 21 జతల ఎడ్లతో కదిలిన రథం శివాజీవిగ్రహం, రైల్వేగేట్‌, గంజ్‌, బోధన్‌ బస్టాండ్‌, గోల్‌హనుమాన్‌ చౌరస్తా, పూలాంగ్‌ చౌరస్తా మీదుగా వినాయకుల బావికి చేరింది. 8 అడుగుల కన్నా ఎత్తున్న విగ్రహాలను ఉమ్మెడ, యంచ గోదావరి తీరానికి తరలించారు. వినాయక నిమజ్జనం సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement