28న కామారెడ్డిలో మంత్రి సీతక్క రివ్యూ | - | Sakshi
Sakshi News home page

28న కామారెడ్డిలో మంత్రి సీతక్క రివ్యూ

Sep 26 2026 1:02 AM | Updated on Sep 26 2026 1:02 AM

28న కామారెడ్డిలో మంత్రి సీతక్క రివ్యూ

● హాజరుకానున్న ఉమ్మడి నిజామాబాద్‌,

కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాల

ప్రజాప్రతినిధులు, అధికారులు

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : రాష్ట్ర పంచాయతీ రాజ్‌, మహిళా,శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క ఈ నెల 28న మూడు ఉమ్మడి జిల్లాల కు సంబంధించిన పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా విభాగాలపై కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో సమీక్షించనున్నారు. ఉమ్మడి నిజామాబాద్‌తోపాటు ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాలకు సంబంధించి సమీక్ష కామారెడ్డిలో నిర్వహించనున్నట్టు ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆయా జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, కలెక్టర్లు, అధికారులు రివ్యూకు హాజరు కానున్నారు. గ్రామీణాభివృద్దితోపాటు పంచాయతీరాజ్‌ శాఖ ద్వారా చేపట్టే పనుల పురోగతి, గ్రామీణ తాగునీటిపైనా సమీక్షించనున్నారు. ఈ నేపథ్యంలో అధికారు లు ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement