పక్కా వ్యూహంతో ప్లాస్టిక్‌కు దూరంగా.. | - | Sakshi
Sakshi News home page

పక్కా వ్యూహంతో ప్లాస్టిక్‌కు దూరంగా..

Sep 25 2026 1:53 AM | Updated on Sep 25 2026 1:53 AM

ఖర్చులు తగ్గుతాయి

● ఆదర్శంగా నిలుస్తున్న పలు పల్లెలు

● గ్రామాల్లో స్టీల్‌ బ్యాంకుల ఏర్పాటు

వేల్పూర్‌: మండలంలోని ఐదు గ్రామాలలో ప్లాస్టిక్‌ వాడకాన్ని రూపుమాపడానికి సర్పంచులు పక్కా వ్యూహంతో ముందుడుగు వేస్తున్నారు. ప్లాస్టిక్‌ వస్తువులను పూర్తిగా మానేసి, వాటి స్థానంలో పూర్వపు మాదిరిగా స్టీలు పాత్రలను వాడడానికి నడుం బిగించారు. అన్నదాన సత్రాలు, శుభకార్యాలు జరిగినప్పుడు వేలాదిగా ప్లాస్టిక్‌ ఇస్తార్లు, గ్లాసులు వాడడం వల్ల వాటితో ప్రకృతికి, ప్రజల ప్రాణాలకు తీవ్రమైన ముప్పు ఏర్పడుతోంది. దీంతో మండలంలోని మోతె గ్రామంలో సర్పంచ్‌ దొల్ల రమేశ్‌రెడ్డి గ్రామస్తుల సహాయంతో స్టీలు పాత్రల బ్యాంకు ప్రారంభించారు. దీంతో వేల్పూర్‌, అక్లూర్‌, అంక్సాపూర్‌, కోమన్‌పల్లి సర్పంచులు సైతం ప్లాస్టిక్‌ వాడకాన్ని పూర్తిగా ఆపేయడానికి ముందుకు వచ్చారు. గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో స్టీలు పాత్రల బ్యాంకులను ఏర్పాటు చేశారు. ఈక్రమంలో గణేశ్‌ ఉత్సవాల్లో అన్నదానాలకు ప్లాస్టిక్‌ ప్లేట్లను ఆపేసి, స్టీలు ప్లేట్లు, గ్లాసులు వినియోగించారు. అలాగే హోటళ్లలో ప్లాస్టిక్‌ కప్పుల వినియోగాన్ని ఆపేసి, గ్లాసుల వినియోగాన్ని ప్రారంభించారు. అంతేగాక దుకాణాల నుంచి సరుకులు తెచ్చుకోడానికి 25 మైక్రాన్లతో తయారైన కవర్లను వినియోగించే విధంగా చర్యలు చేపడుతున్నారు. దీంతో ఆయా గ్రామాల నిర్ణయాన్ని పలువురు అభినందిస్తూ, ఆదర్శంగా తీసుకుంటున్నారు.

శుభకార్యాలు,అన్నదాన సత్రా లు చేయాలంటే ప్లాస్టిక్‌ ఇస్తా ర్లు,గ్లాసులకు సుమారు రూ. వే లల్లో ఖర్చు అవుతుంది. స్టీలు ప్లేట్లు వాడడం వల్ల ఆ ఖర్చు తప్పుతుంది. అంతేగాక ఇస్తార్ల వ్యర్థాల సమస్య ఉండదు. పర్యావరణానికి మేలు జరుగుతుంది. –మొండి అశోక్‌, సర్పంచ్‌, వేల్పూర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement