బాన్సువాడ: బాన్సువాడ మున్సిపల్ పరిధిలో శుక్ర, శనివారం నిర్వహించే వినాయక నిమజ్జన ఏర్పాట్లను ఆర్డీవో రవీందర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ గంగాధర్ గురువారం పరిశీలించారు. శోభాయాత్ర రూట్ మ్యాప్‌ను తయారు చేశారు. కిందికి వేలాడే విద్యుత్ వైర్లను సరి చేయించారు. అవసరమైన చోట్ల పెద్ద పెద్ద విద్యుత్ స్థంబాలను ఏర్పాటు చేయించారు. అనంతరం నిమజ్జనం చేసే కల్కి చెరువు ప్రాంతాన్ని పరిశీలించారు. వినాయక మండపాల నిర్వాహకులు విధి నిర్వహణలో ఉండే అధికారులు, పోలీసులకు సహకరించాలని ఆర్డీవో కోరారు. కో–ఆప్షన్ సభ్యులు కాసుల రోహిత్, ఆర్‌ఐ అలీం, మున్సిపల్ సిబ్బంది హన్మాండ్లు, సతీశ్, లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.
కామారెడ్డి అర్బన్: సామాజిక సేవతోనే వ్యక్తిత్వ వికాసం సాధ్యమవుతుందని కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ విజయ్‌కుమార్ అన్నారు. జాతీయ సేవా పథకం వ్యవస్థాపక దినోత్సవాన్ని గురువారం కళాశాలలో ఘనంగా నిర్వహించారు. యువత తమ శక్తి, సామర్థ్యాలను తక్కువగా అంచనా వేసుకోవద్దని, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసంతో జాతి నిర్మాణానికి, సామాజిక సేవకు అంకితం కావాలని వైస్ ప్రిన్సిపాల్ కిష్టయ్య, సమన్వయకర్తలు శ్రీనివాస్‌రావు, విశ్వప్రసాద్, జయప్రకాశ్, సుధాకర్, రాములు అన్నారు. ఎన్‌ఎస్‌ఎస్ అధికారులు రాజ్ గంభీర్‌రావు, చంద్రశేఖర్‌గౌడ్, రాజశ్రీ, వలంటీర్లు పాల్గొన్నారు.


