మళ్లీ అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సే | - | Sakshi
Sakshi News home page

మళ్లీ అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సే

Sep 25 2026 1:53 AM | Updated on Sep 25 2026 1:53 AM

మళ్లీ అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సే

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు నగేశ్‌ రెడ్డి అన్నారు. డొంకేశ్వర్‌ మండల కేంద్రానికి గురువారం ఆయన విచ్చేసి, కర్ర గణపతికి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే రాష్ట్రంలో అందిస్తున్న ప్రజాపాలనతో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజల నుంచి మంచి ఆదరణ పొందుతుందన్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కే పట్టం కడుతారని అన్నారు. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ప్రతిపక్ష హోదాను విస్మరించి, అసెంబ్లీకి రాకుండా ఫామ్‌హౌస్‌కే పరిమితం అయ్యారని ఎద్దేవా చేశారు. గుత్ప నీరు తాము వదిలితే బీజేపీ నాయకులు సంబరాలు చేసుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆర్మూర్‌లో వచ్చేసారి కాంగ్రెస్‌ జెండా ఎగురవేద్దామని పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధులు, నాయకులు బాపూరావు, వెంకటేశ్‌, భరత్‌రెడ్డి, భోజారెడ్డి, సంజీవ్‌రాజ్‌, ఎర్రం లింగం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement