ధాన్యం కమీషన్‌ ఇంకా రాలే! | - | Sakshi
Sakshi News home page

ధాన్యం కమీషన్‌ ఇంకా రాలే!

Sep 25 2026 1:47 AM | Updated on Sep 25 2026 1:47 AM

ధాన్యం కమీషన్‌ ఇంకా రాలే!

బిచ్కుంద(జుక్కల్‌): ధాన్యం కొనుగోలు కోసం ఏర్పాటు చేసిన ఐకేపీ నిర్వాహకులకు కమీషన్‌ డబ్బులు ఇవ్వడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. 2025 ఖరీఫ్‌, యాసంగి సీజన్‌ల కొనుగోళ్లు ముగిసి నెలలు గడుస్తున్నా కమీషన్‌ రాలేదు. దీంతో మహిళా సంఘాల సభ్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

15.90 లక్షల క్వింటాళ్ల ధాన్యం సేకరణ

జిల్లాలో 2025 ఖరీఫ్‌, యాసంగి సీజన్‌లలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో 174 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 21,308 మంది రైతుల నుంచి 15 లక్షల 90 వేల క్వింటాళ్ల ధాన్యం సేకరించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి ప్రభుత్వం ఫుడ్‌ కార్పొరేషన్‌ ద్వారా క్వింటాలుకు రూ.32 చొప్పున కమీషన్‌ అందిస్తుంది. ధాన్యం సేకరించి నెలలు దాటుతున్నా కమీషన్‌ డబ్బులు చెల్లించడానికి అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని మహిళా సంఘాల సభ్యులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మొత్తం రూ.5.08 కోట్ల కమీషన్‌ రావాల్సి ఉండగా, అధికారులు రూ.3.56 కోట్లు చెల్లించారని, ఇంకా రూ.1.52 కోట్లు చెల్లించాల్సి ఉందని వాపోతున్నారు.

సంఘాల అభివృద్ధికి ఇబ్బందులు

ధాన్యం కొనుగోళ్ల ద్వారా కమీషన్‌ రూపంలో వచ్చే నిధులను సామూహిక మహిళా సంఘాల అభివృద్ధికి వినియోగించుకోవాలని సంఘం సభ్యులు భావిస్తున్నారు. సంఘ కార్యకలాపాలను విస్తరించడం, సభ్యులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడం, స్త్రీనిధి రుణాలు పొందడానికి డిపాజిట్లు చేయడం, ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి కమీషన్‌ నిధులు ఉపయోగపడతాయని అనుకున్నారు. పూర్తిస్థాయిలో కమీషన్‌ అందకపోవడంతో ఆర్థికంగా ఎదగలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్‌ ప్రత్యేక చొరవ తీసుకొని కమీషన్‌ త్వరగా అందేలా చూడాలని కోరుతున్నారు.

ఎదురుచూస్తున్న ఐకేపీ కొనుగోలు

కేంద్రాల నిర్వాహకులు

గత ఖరీఫ్‌, యాసంగిలో

174 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

రూ.1.52 కోట్ల బకాయిలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement