వరి కోతలు షురూ | - | Sakshi
Sakshi News home page

వరి కోతలు షురూ

Sep 25 2026 1:47 AM | Updated on Sep 25 2026 1:47 AM

వరి కోతలు షురూ

● వర్నిలో ప్రారంభం

● ఎకరానికి 45 క్వింటాళ్ల దిగుబడి

సాధించిన రైతు

వర్ని: నిజామాబాద్‌ జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌ వరి కోతలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో ఏటా తొలిసారిగా వర్ని మండలంలో వరి పంట చేతికొస్తుంది. జూన్‌ మాసంలో నారుమడులు వేసిన ఇక్కడి రైతులు సెప్టెంబర్‌ చివరి వారంలో కోతలు ప్రారంభించారు. మొదట కోత ప్రారంభించిన రైతు ఇంట ధాన్యపు సిరులు కురిశాయి. వర్ని మండలం సత్యనారాయణపురం శివారులో శ్రీనగర్‌ గ్రామానికి చెందిన గుణ్ణం సత్తిబాబు రెండు ఎకరాల్లో సాగు చేసిన వరిని గురువారం కోశారు. ఎకరానికి 45 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. కునారం 1638 స్వల్పకాలిక రకం సాగు చేసిన ఆయనకు 120 రోజులకే పంట చేతికి వచ్చింది. కాగా, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వరి సాగు తగ్గడంతో జిల్లాలో పండించిన ధాన్యం అధిక ధర పలుకుతోంది. వ్యాపారులు ప్రస్తుతం పచ్చి ధాన్యం క్వింటాలుకు రూ.2,900 చెల్లిస్తున్నారు. ‘జిల్లాలో 4.30 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. నీటి ఎద్దడి లేకుండా పంటలు చేతికి వస్తాయి. పచ్చి ధాన్యానికి రూ.3వేల వరకు ధర పలికే అవకాశం ఉంది.’ అని డీఏవో వీరాస్వామి ‘సాక్షి’కి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement