పెద్దకొడప్‌గల్: కాస్లాబాద్‌లోని అంగన్‌వాడీ కేంద్రం నిర్వహణపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంగన్‌వాడీ కేంద్రంలో నమోదైన బాలింతలు, చిన్నారులకు సరిపడా పౌష్టికాహరం అందడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రంలో సుమారు 12 మంది బాలింతలు, 11 మంది చిన్నారులు ఉన్నప్పటీకి వంట చేసేందుకు కేవలం నామమాత్రపు బియ్యం మాత్రమే ఉపయోగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి చిన్నారులు, బాలింతలకు అందించే పౌష్టికాహరంపై దృష్టిసారించాలని స్థానికులు కోరుతున్నారు.


